KMR: బాన్సువాడ నియోజకవర్గంలో BRS పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. గోవూర్ గ్రామంలో మండల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల శుక్రవారం సమావేశం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ.. ఏడాదిన్నర కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో ప్రజలు విసుగు చెందుతున్నారని, అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.