W.G. తణుకు మండలంలోని ముద్దాపురం గ్రామంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న దువ్వ – ముద్దాపురం రోడ్డు శంకుస్థాపన పనులను ప్రారంభించారు. త్వరలో రోడ్డు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.