సత్యసాయి: ధర్మవరం పట్టణంలోని ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు శనివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ సందర్భంగా ముస్లింలు ఈద్గా మైదానానికి చేరుకుని సమూహంగా నమాజ్ చేశారు. ఈ సందర్భంగా పరస్పరం ఆలింగనం చేసుకుని ఈద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థనలు చేశారు. ఈ వేడుకల్లో ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.