కృష్ణా: సూరంపల్లిలో జరిగే ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమానికి హాజరుకావడానికి ఉంగుటూరు గ్రామం నుంచి టీడీపీ కార్యకర్తలు, రైతులు భారీగా శుక్రవారం బయలుదేరారు. సీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుని వారు సమూహాలుగా వెళ్లారు. ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు తెలపడానికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు వారు తెలిపారు.