NLR: సంగం మండలం పడమటిపాలెం గ్రామంలో గురువారం పోలీస్ విజిట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నేరాల నియంత్రణపై ప్రజలకు సీఐ శ్రీనివాసులు రెడ్డి, ఎస్సై రాజేష్ అవగాహన కల్పించారు. గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల పాత్ర కీలకమన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.