KDP: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని AP ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికను ప్రకటించింది. కడప జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు అర్హులుగా నిలిచారు. పెండ్లిమర్రి మండలం ఎగువపల్లె హైస్కూల్‌కు చెందిన హిందీ టీచర్ ఖాదీర్, కాశినాయన మండలం రెడ్డికొటాల MPUPS, SGT బీ.పరిమళ జ్యోతి, ప్రొద్దుటూరు పరిధిలోని లింగారెడ్డిపల్లె MPPS, SGT S.జవహర్ మునీర్లు ఎంపికయ్యారు.