GNTR: పొన్నూరు మండలం మన్నవ గ్రామ సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావుపై గత గురువారం దాడి చేసిన ముగ్గురుని పొన్నూరు రూరల్ పోలీసులు అరెస్టు చేసినట్లు శనివారం రూరల్ సీఐ కోటేశ్వరరావు మీడియాకు తెలిపారు. బండ్లమూడి అశోక్, బండ్లమూడి అనిల్, అన్నవరపు అనిల్ బాబులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.