ATP: గుంతకల్లు మున్సిపాలిటీలోని గుంత బావి నుండి పోలీస్ క్వార్టర్స్ వరకు జరుగుతున్న తాగునీటి పైప్లైన్ కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా వాహనదారులు వేరే దారి గుండా వెళ్లాలని మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పైప్ లైన్ మరమ్మతుల అనంతరం యధావిధిగా ఈ రహదారి గుండా వాహనాలు వెళ్తాయని అప్పటివరకు పట్టణ ప్రజల సహకరించాలన్నారు.