ATP: ఉరవకొండ పట్టణ కేంద్రంలోని ఉరగాద్రి చౌడేశ్వరి కళ్యాణమండపంలో ఈనెల 12వ తేదీన ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఉరగాద్రి చౌడేశ్వరి ఆలయ ఛైర్మన్ శరత్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.