VSP: విశాఖపట్నం రైల్వే స్టేషన్లో అక్రమంగా తరలిస్తున్న దాదాపు 3.75 కేజీల బంగారు ఆభరణాలు, రూ. 13.12 లక్షల నగదును రైల్వే పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి బ్యాగు తనిఖీ చేయగా బంగారం, నగదు బయటపడ్డాయి. సరైన పత్రాలు లేకపోవడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.