నెల్లూరు: బుచ్చి పట్టణంలోని ఓ కళాశాలలో 69వ రాష్ట్రస్థాయి ఎస్.జీ.ఎఫ్.ఐ 14 సం. బాల బాలికల ఫెన్సింగ్ క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 13 జిల్లాలు పాల్గొన్నాయి. ఈ పోటీలు మూడురోజులు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు దిలీప్, రత్నం పాల్గొన్నారు. నేటి తరం విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.