SKLM: పాతపట్నం నీలకంఠేశ్వర స్వామి మార్గశిర మాసం మూడవ గురువారం సప్తమి తిదిన గురుదక్షిణామూర్తిగా భక్తులకు దర్శనమిచ్చారు. స్వామిని తెల్లవారుజామునే అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు అనంతరం పుష్పాభిషేకం నిర్వహించారు. పాతపట్నంతోపాటు అనేక ప్రాంతాల నుంచి భక్తులు దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.