గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్)లో రోగుల కోసం వచ్చిన బంధువులకు కనీస ఆశ్రయం లభించడం లేదు. చలికి తట్టుకోలేక, పసిపిల్లలు, వృద్ధులతో సహా కుటుంబ సభ్యులు ఆసుపత్రి బయటే నిద్రిస్తున్నారు. ఈ దుస్థితిపై ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే దృష్టి సారించి, వారికి తగిన వసతి, ఆశ్రయాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు గట్టిగా కోరుతున్నారు.