NLR: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో విడవలూరు మండలంలోని పలు ప్రాంతాల్లో వానలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వాన కురుస్తూనే ఉంది. మండలంలోని మలిదేవి బ్రిడ్జిపై వర్షపు నీరు పొంగుతోంది. ఈ క్రమంలో మన్మధరావు పేట, విడవలూరు వెళ్లే వాహనదారులు, స్థానికులు అటు వైపు వెళ్ళవద్దని అధికారులు పేర్కొన్నారు.