VSP: జగదాంబ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు విస్తరించిన రోడ్డు కొలతలను GVMC కమీషనర్ కేతన్ గార్గ్ గురువారం పరిశీలించారు. రోడ్డు విస్తరణలో ఆస్తులు కోల్పోయిన వారికి TDRలు జారీ చేసే విషయంలో ఎటువంటి తేడాలు లేకుండా చూడాలని చీఫ్ సిటీ ప్లానర్ ఆదేశించారు. విస్తరణలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ఎన్ని ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.