KRNL: టీడీపీ మంత్రాలయం మండల అధ్యక్షుడిగా సింగరాజనహళ్లికి చెందిన గోపాల్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జిల్లా కమిటీ మంగళవారం విడుదల చేసింది. తనపై నమ్మకంతో మండల అధ్యక్షుడిగా ఎన్నిక చేసినందుకు ఇంఛార్జ్ రాఘవేంద్రరెడ్డి కుటుంబానికి రుణపడి ఉంటానని ఆయన అన్నారు. మండలంలో టీడీపీ బలోపేతానికి సైనికుడిలా పని చేస్తానన్నారు.