NDL: జూపాడుబంగ్లా మండలం తత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీలక్ష్మి సమేత శ్రీ రంగనాథస్వామిని ఎమ్మెల్యే గిత్త జయసూర్య పార్లమెంట్ ఇంఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి ఎద్దుల పెద్ద బండలాగుడు పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.