E.G; సంక్రాంతి వేళ యువత కోడిపందాలు, పేకాట వంటి జూదాలకు దూరంగా ఉండాలని కోరుకొండ సీఐ మూర్తి కోరారు. శనివారం గోకవరం మండలం గుమ్మలదొడ్డిలో నైట్ క్రికెట్, రంప ఎర్రంపాలెంలో వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించారు. వ్యసనాలకు బానిసలు కాకుండా సంప్రదాయ క్రీడలో ప్రతిభ చాటాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించి జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.