సత్యసాయి: ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని హిందూపురం వైసీపీ ఇంఛార్జ్ దీపిక అన్నారు. గురువారం హిందూపురంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. దీపిక మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు తన బినామీలకు లబ్ధి చేకూర్చడానికే ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడుతున్నారన్నారు.