ELR: బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరంలో పామాయిల్ గెలలను దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు మడకం వెంకటేశ్వరరావుతో పాటు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకుని జంగారెడ్డిగూడెం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించారన్నారు. రైతులు తమ తోటల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు