SKLM: పొందూరులోని బండార్లమ్మ గుడి సమీపంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఖచ్చితమైన సమాచారంతో దాడి చేసి , 9 మంది జూదరులను పట్టుకున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 6,030ల నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. జూదం ఆడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.