KDP: రంజాన్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ఉండనుంది. తొలుత జారీ చేసిన హాలిడేస్ లిస్ట్‌లో సెలవు నిన్న ఉండగా నెలవంక దర్శనం ఆధారంగా పండుగ శనివారం జరుపుకోవాలని ముస్లిం మతపెద్దలు నిర్ణయించారు. దీంతో ప్రభుత్వాలు నేడు సెలవు దినంగా ప్రకటించాయి. అయితే. నేడు జరగాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్షను ఏప్రిల్ 2కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.