పల్నాడు: వెల్దుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జూలకంటి నిర్వహించిన ప్రజాదర్బార్‌కు ప్రజల నుంచి 50కు పైగా వినతులు అందాయి. రెవెన్యూ, భూ కబ్జాలు, పింఛన్లు, సీఎం రిలీఫ్ ఫండ్ వంటి అనేక సమస్యలపై ప్రజలు తమ అర్జీల ద్వారా ఎమ్మెల్యేకు విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు.