కోనసీమ: సోమవారం నుంచి జరిగే పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని అమలాపురం DM సత్యనారాయణమూర్తి ఆదివారం తెలిపారు. పదో తరగతి పరీక్షలు రాస్తే పరీక్షలకి హాజరయ్యే విద్యార్థులు కేవలం వారి హాల్ టికెట్ ఆధారంగా ఏ విధమైన బస్సు పాస్ లేకపోయినా పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులలో ఉచిత ప్రయాణం చేయవచ్చన్నారు.