MDK: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను అవమాన పరిచే విధంగా మాట్లాడినందుకు నిరసనగా బీఆర్ఎస్ నాయకుల దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రామాయంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన రామాయంపేటలో మాట్లాడుతూ.. ఆదివారం ప్రతి మండల, గ్రామాల్లో నిరసన కార్యక్రమం చేపట్టాలని పేర్కొన్నారు.