NTR: జిల్లాలో టెన్త్ ఎగ్జామ్స్కు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు DEO U.V సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 31,231 మంది విద్యార్థులు 168 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 6 సమస్యాత్మక కేంద్రాలలో సీసీ కెమెరాల నిఘా ఉంటుందని చెప్పారు. మొబైల్/ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు.