SKLM: ప్రపంచాన్ని తన ఆలోచనలతో నడవడికతో ప్రభావితం చేసిన మహాత్మా గాంధీ స్ఫూర్తి విశ్వజనీయమైనదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. జిల్లా పర్యటనకు బుధవారం విచ్చేసిన ఆయన శ్రీకాకుళం పట్టణంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్తల స్మృతి వనాన్ని ఆయన సందర్శించారు. మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.