భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం రుద్రంపూర్ గ్రామానికి చెందిన యువకుడు మొహమ్మద్ హఫ్రీద్ ఒకే సంవత్సరంలో ఐదు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించాడు. టీజీపీఎస్సీ, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, సింగరేణి, జూనియర్ లెక్చరర్ పోటీ పరీక్షల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి, 5 ఉద్యోగాలు సాధించాడు.