NLR: కూటమి ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు అండగా ఉందని ఏపీ వర్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఇమామ్, మోజన్ల జీతాలను విడుదల చేశామని ఆయన అన్నారు. నెల్లూరులో జామియా మస్జిద్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ.. విశ్వ శాంతి కోసం ప్రార్థనలు చేశామన్నారు.