కృష్ణా: బహిర్భూమికి వెళ్లిన వ్యక్తికి ఫిట్స్ రావడంతో కాలువలో పడి మృతి చెందిన విషాదకర సంఘటన ఘంటసాల మండలంలో శనివారం జరిగింది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. కొడాలి గ్రామంలోని గూడెంకు చెందిన కొడాలి డేవిడ్ ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో దేవరకోట గ్రామంలోని వంతెన వద్ద బహిర్భూమికి వెళ్లగా, ఆ సమయంలో ఫిట్స్ రావటంతో కాలువలో పడి ఊపిరాడక మృతి చెందాడు.