కెనడా నూతన ప్రధాన మంత్రి మార్క్ కార్నీ మంత్రివర్గంలో ఇద్దరు భారత సంతతి ఎంపీలకు స్థానం లభించింది. ఇండో-కెనడియన్ అనిత ఆనంద్, ఢిల్లీలో జన్మించిన కమల్ ఖేరాలకు మంత్రి పదవులు లభించాయి. అనితకు ఇన్నోవేషన్, సైన్స్, పరిశ్రమల శాఖ, కమల్ ఖేరాకు ఆరోగ్యశాఖ ఇచ్చారు. మంత్రి పదవులు నిలబెట్టుకున్న కొద్దిమందిలో వీరిద్దరూ ఉన్నారు.