NGKL: భద్రాచలం శ్రీ రాముని ముత్యాల తలంబ్రాలు తపాల ద్వారా అందిస్తున్నట్లు జిల్లా తపాల అధికారి సృజన్ నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు రూ.150 ముత్యాల తలంబ్రాలు, రూ. 450 చెల్లిస్తే భక్తులకు గోత్రనామాలతో పసుపు, కుంకుమ, ముత్యాల తలంబ్రాలు ఇంటి వద్దకు అందజేస్తామని అన్నారు. నగదును స్థానిక పోస్ట్ ఆఫీస్లో చెల్లించాలన్నారు.