ELR: ఏలూరులో ఈనెల 6న జిల్లాస్థాయి ఈత పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా కార్యదర్శి మల్లికార్జునరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జూనియర్ బాల బాలికల విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. పోటీలో ఎంపికైన క్రీడాకారులు ఈనెల 19, 20 తేదీల్లో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. పూర్తి వివరాల కోసం 9440337313 నంబర్లను సంప్రదించాలన్నారు.