NLR: వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగు ప్రాథమికోన్నత పాఠశాలలో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు వెంగయ్యను సస్పెండ్ చేస్తూ డీఈఓ బాలాజీరావు ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలో వెంగయ్య బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని రెండు రోజల క్రితం గ్రామస్తులు దేహశుద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు తెలిపారు.