VZM: గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్యను తన స్వగృహంలో నూతనంగా నియమితులైన మండల పార్టీ అధ్యక్షులు బూడి వెంకటరావు, బొద్దల చిన్నంనాయుడు, రాపాక కృష్ణమూర్తి జాగారపు అప్పారావు, గొర్లి రవికుమార్‌లు కలిశారు. అనంతరం శాలువ కప్పి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సత్కరించారు. తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తామని వాళ్ళు తెలిపారు.