VZM: విద్యా ప్రాధాన్యతను వివరిస్తూ ప్రభుత్వ బడుల టీచర్లు ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం చేపట్టారు. శనివారం పారసాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల బృందం చిన్న బురడ పేట గ్రామాన్ని సందర్శించారు. సర్కార్ బడుల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను పిల్లలకు, తల్లిదండ్రులకు వివరించారు. తమ బడిలో విద్యార్థులను చేర్చాలని కోరారు.