CTR: పుంగనూరులోని శ్రీ విరుపాక్షి మారెమ్మ ఆలయంలో ఈ నెల 5న బహిరంగ వేలం పాట నిర్వహిస్తున్నట్లు EO రమణ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ప్రతి నెలా అమావాస్య నాడు దిష్ఠి గుమ్మడికాయ, నిమ్మకాయ, దిష్టి టెంకాయలు, కంకణాలు అమ్ముకొనేందుకు బహిరంగ వేలం వేయనున్నారు. ఆసక్తి ఉన్నవారు ధరావత్తు చెల్లించి వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు. కాల పరిమితి ఒక సంవత్సరం ఉంటుందన్నారు.