సత్యసాయి: చోళసముద్రం టోల్ ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులను కాపాడి గుడ్డంపల్లి వేణు రెడ్డి మానవత్వం చాటుకున్నారు. బైక్ ప్రమాదానికి గురై రోడ్డుపై పడి ఉన్న వ్యక్తిని గమనించిన ఆయన, వెంటనే తన కారును ఆపి బాధితుడికి సాయం చేశారు. క్షతగాత్రులకు తాగునీరు అందించి మనోధైర్యం నింపడమే కాకుండా, అంబులెన్స్ పిలిపించి ఆస్పత్రికి తరలించారు.