SKLM: మెలియాపుట్టి మండలంలోని చాపర గ్రామంలో వైసీపీ నాయకులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడానికి చూస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఈ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు అందజేస్తామన్నారు.