విజయనగరం పోస్టల్ డివిజన్ పరిధిలోని తపాలా వినియోగదారుల సమస్యలు పరిష్కరించుటకు ఈనెల 19 ఉదయం 11.00 గంటలకు జరుగుతుందని సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు. సూపరింటెండెంట్ కార్యాలయంలో తపాలా అదాలత్ మరియు పెన్షన్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు. పోస్టల్ వినియోగదారుల పిర్యాదులు, సమస్యలు 15 లోపు విజయనగరం పోస్ట్ ఆఫీసుకు పంపాలని కోరారు.