SKLM: జిల్లా సీనియర్స్ సాఫ్ట్ బాల్ పురుషుల జట్టు ఎంపికలు ఈనెల 12 న జరగనున్నాయని జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియం వేదికగా ఉదయం 10 గంటలకు ఎంపికల ప్రక్రియ మొదలవుతుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 94410 11391 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.