అన్నమయ్య: రైల్వే కోడూరు TDP ఇంఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి మానవతా విలువలను చాటుకున్నారు. ఈ మేరకు బ్రెయిన్‌స్ట్రోక్ కారణంగా తిరుపతి స్విమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రైల్వే కోడూరు మండలం ఉర్లగడ్డ పొడు అరుంధతివాడకు చెందిన వేమ్మడి రాధాకృష్ణను శుక్రవారం ఆయనను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.