GNTR: కాకుమాను మండలం కొండపాటూరులో పోలేరమ్మ తల్లి తిరునాళ్లు ఏప్రిల్ 7న నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ పొన్నం వీరయ్యచౌదరి, ఈవో జక్కా శ్రీనివాసరావు తెలిపారు. గురువారం పంచాంగ శ్రవణం అనంతరం పోస్టర్ విడుదల చేశారు. ఈ నెల 31న మల్లెల పూజ, ఏప్రిల్ 3న కుంకుమ పూజ జరుగుతుంది. పూజా సామగ్రి ఆలయం నుంచి అందిస్తారన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.