శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, కొత్తూరు మండలాల్లోని పలు గ్రామాల్లో గిరిజనులు గుక్కెడు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చీపురుపల్లి, పెద్దరాజపురం, చిన్నరాజపురం, జెన్నుడుగుడ, దొండమానుగూడ, అడ్డయిగూడ, పాండ్రమానుగూడ గ్రామాల్లో నీటి కొరత తీవ్రంగా ఉంది. తాగునీరు, రేషన్ బియ్యం కోసం నిత్యం ఇబ్బందులు తప్పడం లేదని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.