SKLM: అరసవల్లిలో ఆదిత్యుని వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా ఉషా, ఛాయ, పద్మిని సమేత సూర్యనా రాయణస్వామి ఉత్సవ మూర్తులకు అర్చ కులు ఇంద్రపుష్కరిణి వద్ద చక్రతీర్థ స్నానం నిర్వహించారు. అనంతరం గురువారం సాయంత్రం అనివెట్టి మండపంలో వైభవంగా ఏకాంత సేవ, పుష్పయాగం చేశారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.