KDP: కడప తాలూకా పరిధిలోని నబీకోటలో 8 మంది పేకాటరాయలను గత రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. CI రెడ్డప్ప మీడియాతో మాట్లాడుతూ.. అందిన సమాచారం మేరకు నబి కోటలోని ఓ ఇంటిపై దాడి చేసి ఇంటిలో జూదమాడుతున్న 8 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2,01,320 రూపాయల నగదు, పేక ముక్కలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.