KDP: జమ్మలమడుగు మండలంలోని గండికోటలో ఈనెల 11,12,13 తేదీల్లో నిర్వహించనున్న గండికోట ఉత్సవాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి శుక్రవారం పరిశీలించారు. ఉత్సవాలకు సంబంధించి ప్రధాన వేదిక, కమాండ్ కంట్రోల్ రూమ్, స్టాల్స్, పార్కింగ్, పారిశుధ్యం, భద్రతా చర్యలు తదితర ఏర్పాట్లను 10వ తేదీ మధ్యాహ్నం లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.