ప్రకాశం: టంగుటూరు మండలంలోని జయవరం గ్రామ సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకుపోయింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గురువారం ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒంగోలు నుంచి కొండపికి ప్రయాణికులతో వెళ్తుంది. జయవరం సమీపంలో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకువెళ్లింది. బస్సులో ఉన్న కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి.