SKLM: స్థానిక కిన్నెర థియేటరు వద్ద మద్యం తాగి అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి 10 రోజులు జైలు శిక్ష విధిస్తూ సెకెండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కె.శివరామకృష్ణ తీర్పును ఇచ్చారు. గత నెల 27న అతనిపై ఎస్సై హరికృష్ణ కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. అనంతరం న్యాయ స్థానంలో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు. నిందితుడికి శిక్ష తర్వాత ఇవాళ జిల్లా కేంద్ర కారాగారానికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.