VZM: ఎస్ కోట మండలం బొడ్డవర పంచాయతీ పరిధిలోని జిందాల్ భూ నిర్వాసితులు తమకు న్యాయం చేయాలని చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టారు. ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చల్లా జగన్ ఆధ్వర్యంలో సోమవారం బయలుదేరి బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు . భూ నిర్వాసితుల సమస్యలను కేంద్ర ప్రభుత్వానికి, మానవ హక్కుల సంఘాలకు తెలియపరచనున్నట్లు తెలిపారు.